మాదక ద్రవ్యాల వినియోగంపై పోలీసులు ఎంత నిఘా ఉంచినా రహస్యంగా అమ్మకాలు, సరఫరా జరుగుతూనే ఉంది. స్టూడెంట్స్ నుంచి మహిళల వరకు ఈ రొంపిలో దిగుతూ కెరీర్ ను నాశనం చేసుకుంటున్నారు. 2026 ఏప్రిల్ 23 న పల్నాడు ఎక్స్ ప్రెస్ లో గంజాయి దొరకటం కలకలం రేపింది. 25.5 కేజీల గంజాయిని సీజ్ చేశారు పోలీసులు.
ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆర్.కిషన్. ఒడిశా నుంచి గుంటూరుకు గంజాయి తెచ్చినట్లు చెప్పారు. అక్కడి నుంచి వికారాబాద్ కు తరలిస్తుండగా పల్నాడు ఎక్స్ ప్రెస్ లో పోలీసులు పట్టుకున్నారు. కర్రి రమణమ్మ,అర్లి లవమ్మ, అర్లి గోవిందులను పోలీసులు అదుపులోకి తీసుకునారు.
►ALSO READ | హైదరాబాద్లో చల్లబడిన వాతావరణం.. సిటీలోని ఈ ఏరియాల్లో వర్షం
గంజాయి సరఫరా చేస్తున్నందుకు నిందితులు ఒక్కొక్కరు 10 వేల రూపాయల ఒప్పందం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. NDPS చట్టం కింద నిందులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దీని వెనుక ఉన్న కీలక సప్లైయర్లను పట్టుకునేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు.

