సెప్టెంబర్ 22 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు

సెప్టెంబర్ 22 నుంచి  ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు
  • ఫీజు చెల్లించేందుకు 28 నుంచి అవకాశం 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు సెప్టెంబర్ 22 నుంచి 29 వరకు జరగనున్నాయని టాస్ డైరెక్టర్ పీవీ. శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలు రాయదలచిన అభ్యర్థులు http://www.telanganaopenschool.org వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్ ద్వారా లేదా టీజీ ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ / మీ సేవ కేంద్రాల ద్వారా చెల్లించొచ్చని చెప్పారు. ఈ నెల 28 నుంచి ఆగస్టు 5 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించొచ్చని వెల్లడించారు. ఒక్కో పేపర్ కు రూ.25 ఫైన్​తో ఆగస్టు 10 వరకు, 50 ఫైన్​తో రూ.15 వరకూ ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. త్వరలోనే పరీక్షల షెడ్యూల్ రిలీజ్ చేస్తామని, అభ్యర్థులు వెబ్ సైట్ చూస్తూండాలని సూచించారు.