అలుగు పారుతోన్న రంగనాయకుల చెరువు

అలుగు పారుతోన్న రంగనాయకుల చెరువు
  • నిలిచిన రాకపోకలు 

జడ్చర్ల,  వెలుగు: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని పోలేపల్లి రంగనాయకుల చెరువు అలుగుపారుతోంది. దీంతో పోలేపల్లి, కిష్టారం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రంగనాయకుల చెరువులోకి ఉదండాపూర్​ రిజర్వాయర్​లో నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో నీటి ఉధృతి పెరిగింది. ఆదివారం జీపీ సెక్రటరీ లక్ష్మీనారాయణగౌడ్​మాట్లాడుతూ.. రెండు గ్రామాల మధ్య ప్రజలు రాకపోకలు సాగించకుండా రోడ్డుపై అడ్డంగా ముళ్ల కంచె వేసినట్లు తెలిపారు.