రాష్ట్రపతి కోసం ట్రాఫిక్‌ ఆగింది.. ఒక ప్రాణం పోయింది

రాష్ట్రపతి కోసం ట్రాఫిక్‌ ఆగింది.. ఒక ప్రాణం పోయింది

లక్నో: రాష్ట్రపతి రామ్‌‌నాథ్‌‌ కోవింద్‌‌ పర్యటన సందర్భంగా శుక్రవారం కాన్పూర్‌‌‌‌లో ట్రాఫిక్‌‌ ఆపేయడంతో అనారోగ్యంతో ఉన్న మహిళ మృతి చెందింది. రాష్ట్రపతి తను పుట్టి పెరిగిన ఊరు కాన్పూర్‌‌‌‌ దగ్గర్లోని పరౌఖ్​కి వెళ్లారు. దాంతో ఆ ఏరియాలోని ట్రాఫిక్‌‌ బంద్‌‌ అయింది. అదే రూట్‌‌లో కాన్పూర్‌‌‌‌లోని చాప్టర్‌‌‌‌ ఆఫ్​ ద ఇండియన్‌‌ అసోషియేషన్‌‌ ఇండస్ట్రీలో మహిళా విభాగానికి హెడ్‌‌ గా కొనసాగుతున్న వందనా మిశ్రా ప్రయాణం చేస్తున్నారు. అయితే మిశ్రా రీసెంట్‌‌గా కోవిడ్‌‌ నుంచి కోలుకున్నారు. అయినా ఆమె హెల్త్‌‌ తిరిగి పాడయిన కారణంగా ఆసుపత్రికి వెళుతుండగా ఘటన జరిగిందన్నారు. పోలీసులు ఆమె కుటుంబానికి క్షమాపణలు తెలిపారని, ఇలాంటి సిచ్యుయేషన్‌‌ ఇక ముందు రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామని కాన్పూర్‌‌‌‌ పోలీస్‌‌ కమిషనర్‌‌‌‌ ఆసిమ్‌‌ అరుణ్​ చెప్పారు.