ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.62 కోట్లు

ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.62 కోట్లు

తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. వీకెండ్, వరుస సెలవులతో శ్రీవారి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. సర్వదర్శనం టోకెన్లు  లేకుండానే భక్తులను అనుమతిస్తుండడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 30 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి   3 గంటల సమయం పడుతోంది. శనివారం  76 వేల 746 మంది భక్తులు  శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న ఒక్కరోజే హుండీ ఆదాయం 4 కోట్ల 62 లక్షలు వచ్చింది. ఇక శ్రీవారి కళ్యాణ కట్టలలో 31 వేల 574 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. 

మూడేళ్ల తర్వాత  ఐపీఎల్‌ ముగింపు వేడుక