"నాటు నాటు"పాటకు సైనికుల స్టెప్పులు.. ఆకట్టుకుంటున్న వైరల్ వీడియో

"నాటు నాటు"పాటకు సైనికుల స్టెప్పులు.. ఆకట్టుకుంటున్న వైరల్ వీడియో

అవార్డ్ విన్నింగ్ మూవీ 'ఆర్ఆర్ఆర్' కి క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇటీవలే ఆస్కార్‌ గెలుచుకున్న ఈ యాక్షన్-డ్రామా సినిమా.. ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమానులను సంపాదించుకుంది. ఇప్పటికీ ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో థియేటర్‌లలో నడుస్తూ రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికీ "నాటు నాటు" అనే ఎలక్ట్రిఫైయింగ్ ట్రాక్‌కి ప్రజలు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్ సైనికులు ఈ హిట్ ట్రాక్‌కి స్టెప్పులేసిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

ఈ వీడియోను జేన్ ఫెడోటోవా ట్విట్టర్‌లో షేర్ చేశారు. రెండు నిమిషాల నిడివి ఉన్న క్లిప్‌లో సోల్జర్స్ అద్భుతమైన స్టెప్స్ వేశారు. ఒరిజినల్ వీడియోలో ఇద్దరు నటులు బ్రిటీషర్లకు వ్యతిరేకంగా ఎలా ప్రదర్శన ఇచ్చారో, రష్యా దండయాత్రకు వ్యతిరేకంగా సైనికులు చేసిన ఈ ప్రదర్శనలు అందర్నీ ఆకట్టుకుంటోంది. 'RRR' అధికారిక ట్విట్టర్ ఖాతా కూడా మూడు ఫోల్డింగ్ హ్యాండ్స్ ఎమోజీలతో పాటు క్లిప్‌ను రీట్వీట్ చేసింది. ఈ వీడియోకు ఇప్పటివరకు 6లక్షలకు పైగా వ్యూస్, 6వేలకు పైగా లైక్స్ వచ్చాయి.

https://twitter.com/jane_fedotova/status/1663297097783734274