రాష్ట్రాలకు రూ.లక్ష కోట్ల నిధి

రాష్ట్రాలకు రూ.లక్ష కోట్ల నిధి

కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాలకు పెద్ద ఊరట. రాష్ట్రాల కోసం రూ.లక్ష కోట్ల నిధిని ప్రకటించారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్రాలకు ఆర్థిక సాయంగా రూ.లక్ష కోట్ల నిధి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రత్యేక నిధి ద్వారా రాష్ట్రాలకు వడ్డీలేని రుణాలు ఇస్తామన్నారు. అలాగే ఆర్బీఐ ద్వారా సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీని ప్రవేశపెడుతున్నామన్నారు. రూపాయికి మరింత బలాన్ని చేకూర్చేలా డిజిటల్‌ రూపీని రూపొందిస్తామని, కరెన్సీ కార్యకలాపాల నిర్వహణలో డిజిటల్‌ కరెన్సీ రూపకల్పన జరుగుతుందన్నారు.