యూట్యూబ్ ద్వారా రూ.1కోటి సంపాదన.. నిజమేనంటారా

యూట్యూబ్ ద్వారా రూ.1కోటి సంపాదన.. నిజమేనంటారా

ఉత్తరప్రదేశ్‌లోని ఓ యూట్యూబర్‌.. కేవలం వీడియోల ద్వారానే రూ.1కోటి సంపాదించాడు. ఈ క్రమంలో అతను చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా డబ్బు సంపాదించాడని పలువురు ఆరోపించబడంతో.. ఆదాయపు పన్ను శాఖ అధికారులు అతని ఇంటికి చేరుకుని సోదాలు నిర్వహించారు.

యూట్యూబర్ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించగా రూ.24 లక్షల నగదు దొరికింది. తస్లీమ్ కొన్నేళ్లుగా యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతున్నాడని, ఇప్పటివరకు దాదాపు రూ.1 కోటి సంపాదించాడని అధికారులు తెలిపారు. అతను చట్టవిరుద్ధమైన పనులు చేసి ఈ డబ్బు సంపాదించాడని వచ్చిన ఆరోపణలపై అతని కుటుంబం తిప్పి కొట్టింది.

యూపీలోని బరేలీలో ఉంటున్న తస్లీమ్.. షేర్ మార్కెట్‌కు సంబంధించిన వీడియోలు తీస్తూ, ఆదాయపు పన్ను కూడా చెల్లిస్తున్నాడని అతని సోదరుడు తెలిపాడు. 'ట్రేడింగ్ హబ్ 3.0' అనే యూట్యూబ్ అకౌంట్ ను తన సోదరుడు నిర్వహిస్తున్నాడని ఫిరోజ్ స్పష్టం చేశాడు. ఇప్పటివరకు  తమకు YouTube ద్వారా రూ.1.2 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని, తాము ఇప్పటికే రూ. 4 లక్షల పన్నులు చెల్లించామని కూడా ఆయన పేర్కొన్నారు.

తాము ఎటువంటి తప్పుడు పని చేయమని, యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుడం ద్వారా తమకు ఆదాయం వస్తుందని ఫిరోజ్ అన్నాడు. ఇదే వాస్తమన్న ఆయన.. ఇలా దాడులు చేయడాన్ని వ్యతిరేకించారు. తస్లీమ్ తల్లి కూడా తన కొడుకు తప్పేం లేదని, కావాలనే అతన్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.