తిమ్మాపూర్ మండలంలో యూరియా కోసం బారులు

తిమ్మాపూర్ మండలంలో యూరియా కోసం బారులు

తిమ్మాపూర్/శంకరపట్నం, వెలుగు: యూరియా కోసం రైతుల అవస్థలు తప్పడం లేదు. తిమ్మాపూర్​ మండలంల మొగిలిపాలెం గ్రామంలోని ఓ గోదాంకి సోమవారం రాత్రి యూరియా బస్తాలు రాగా.. మంగళవారం మబ్బుల 4గంటలకే దుకాణానికి చేరుకున్నరు. గంటల తరబడి నిల్చునే ఓపిక లేక చెప్పులు లైన్లవెట్టి బస్తాల కోసం పడిగాపులుగాశారు.​  శంకరపట్నం మండలం కరీంపేటలో యూరియా పంపిణీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సోమవారం రాత్రి కరీంపేట గ్రామానికి 250 బస్తాలు వచ్చాయి. 

దీంతో రైతులు కొందరు ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిరాక్స్‌‌‌‌‌‌‌‌లు, మరికొందరు చెప్పులు క్యూలో పెట్టారు. ఆధార్ జిరాక్స్‌‌‌‌‌‌‌‌లు పెట్టిన రైతులకే మొదట యూరియా బస్తాలు ఇస్తుండడంతో వాగ్వాదం జరిగింది. తాడికల్‌‌‌‌‌‌‌‌ సొసైటీ సీఈవో వీరస్వామి కరీంపేటకు చేరుకోగా ఆయనతోనూ రైతులు వాగ్వాదానికి దిగారు.  దీంతో పోలీస్ బందోబస్త్​మధ్య యూరియా పంపిణీ చేశారు. అలాగే తాడికల్‌‌‌‌‌‌‌‌ సొసైటీకి 450 బస్తాలు రాగా ఏడీఏ శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఏవో వెంకటేశ్‌‌‌‌‌‌‌‌ పర్యవేక్షణలో బస్తాలు పంపిణీ చేశారు.