ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయా.. వెంటనే తీసేయండి... లేకపోతే...

ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయా.. వెంటనే తీసేయండి... లేకపోతే...

పురాణాల్లో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.   సిద్దాంతం ప్రకారం ఇంటి నిర్మాణం ఉండకపోయినా.. ఇంట్లో వస్తువులు ఏవి ఎక్కడ ఉండాలో అక్కడ లేకపోయిన.. తరచే అనేక సమస్యలు వస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.   మానసిక స్థితి...ఆరోగ్యంపై కూడా వాస్తు ప్రభావం ఉంటుందని  నమ్మే వారు కూడా చాలా మంది ఉన్నారు.  వాస్తు అనేది  ఇంటి నిర్మాణంలోనే కాదు.. ఇంట్లో ఉండే వస్తువుల విషయంలో కూడా ఉంటుందని వాస్తు శాస్త్రంలో అనేక విషయాలను ప్రస్తావించినట్లు పండితులు చెబుతున్నారు.  ఇంతకీ ఇంట్లో ఉంచకూడని ఆ వస్తువులు ఏంటి.? వాటి వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం…

  • ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టుకుంటే చిన్నపాటి వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయని పండితులు అంటున్నారు. అయితే కొన్ని వస్తువులు ఉంటే కష్టాలను కొని తెచ్చుకున్నట్లేనని వాస్తు నిపుణులు అంటున్నారు.   కొన్ని వస్తువుల వల్ల ఇంట్లో కుటుంబ సభ్యుల్లో సఖ్యత తగ్గడం, నిత్యం ఏదో ఒక గొడవ, మానసిక ఆనందం దూరమవడం వంటి సమస్యలు వెంటాడుతాయని హెచ్చరిస్తున్నారు. 
     
  • మనలో చాలా మంది ఇంట్లో విరిగిన దేవుని విగ్రహాలను అలాగే ఉంచుకుంటారు. పూజా గది వరకు అయితే తొలగిస్తుండొచ్చు కానీ. హాల్‌లో గోడకు వేసే దేవుడి సీనరీలకు గురించి పెద్దగా పట్టించుకోరు. అవి ఎలాఉన్నా పట్టించుకోము. అయితే దేవతా రూపాలున్నా ఓ విగ్రహం కానీ, ఫొటోలు చిరిగినా.. విరిగినా వెంటనే తొలగించాలని చెబుతున్నారు. ఇలాంటి వాటిని ఇంట్లో పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు వెంటాడుతాయని చెబుతున్నారు.
     
  • చూడ్డానికి వెరైటీగా ఉంటుందని కొందరు ఇంట్లో బ్రహమ్మజెముడు లాంటి ముళ్ల మొక్కను పెంచుకుంటుంటారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని, ఇలాంటి మొక్కలు ఇంట్లో ఉంటే వెంటనే తొలగించాలని వాస్తు పండితులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఇంటి లోపల ఇలాంటి మొక్కలు పెంచితే.. జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోక తప్పదని చెబుతున్నారు.
     
  •  ఇక ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో పనిచేయని గడియారం ఉంచకూడదని నిపుణులు చెబుతున్నారు. ఆగిపోయిన వాచ్ నిశ్చలతకు చిహ్నంగా పరిగణిస్తారు. కాబట్టి ఇంట్లో ఉన్న ప్రతీ గడియారం కచ్చితంగా నడిచేలా చూసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
     
  •  ఇక వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో విరిగిన తాళాన్ని ఉంచుకోకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇలా పనిచేయని, విరిపోయిన తాళం ఇంట్లో ఉంటే.. జీవితంలో సమస్యలు, అడ్డంకులు ఏర్పడుతాయని, కెరీర్‌కు ఆటంకం ఏర్పడుతుందని చెబుతున్నారు.
     
  • రుద్ర రూపంలో ఉండే దేవి లేదా దేవుడికి సంబంధించిన మూర్తులు లేదా చిత్ర పటాలు పూజలో ఉండకూడదు. వీటి వల్ల ఇంట్లో అనిశ్చితి పెరిగే ప్రమాదం ఉంటుంది.
     
  • చిరిగిన లేదా జీర్ణమయిన పూజ పుస్తకాలు పూజ గదిలో ఉంటే తీసెయ్యడం మంచిది. ఇలాంటి వాటిని ప్రవహించే నీటిలో వదిలెయ్యడం మంచిది.
     
  • అక్షతలుగా ఎప్పుడూ కూడా విరిగిన బియ్యం గింజలు అంటే నూకలను వాడకూడదు. అటువంటి బియ్యం పూజ గదిలో ఉంటే వాటిని తీసేసి మంచి బియ్యం ఉంచాలి.
     
  • పూజ గదిలో గతించిన పెద్ద వారి చిత్రాలు కూడా ఉంచరాదు. వీటి వల్ల చాలా అశుభ పరిణామాలు ఉండవచ్చు. అందుకే పెద్ద వారి చిత్రాలు ఇంటిలోని మరో చోట ఎక్కడైనా పెట్టాలి.
     
  •  పాత న్యూస్‌ పేపర్లు ఇంట్లో ఉండడం సర్వ సాధారణమైన విషయం. అయితే లెక్కకు మించి పేపర్‌ కుప్పను ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉంచుకోకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఎప్పటి పత్రికలను అప్పుడు అమ్మేయాలని చెబుతున్నారు. దుమ్ముధూళితో పేరుకుపోయిన న్యూస్ పేపర్స్ ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీకి కారణమవుతుందని చెబుతున్నారు.
     
  • వాస్తు శాస్త్రం ప్రకారం, యుద్ధ చిత్రాలను ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదు. ఈ చిత్రాలు కుటుంబ సభ్యులపై చెడు ప్రభావం చూపుతాయని అంటున్నారు.
     
  •  మునిగిపోతున్న ఓడ యొక్క చిత్రం, కత్తి యుద్ధం  చిత్రం, బాధితుడి చిత్రం, బంధించబడిన ఏనుగు లేదా ఏడుస్తున్న వ్యక్తి చిత్రాన్ని ఇంట్లో పెట్టకూడదు.
     
  •  ఇంట్లో సూర్యుని బొమ్మను ఉంచినట్లయితే, అప్పుడు ఉదయించే సూర్యుని బొమ్మను పెట్టాలి. ఇలా చేయడం వల్ల కెరీర్‌లో పురోగతి ఉంటుందని అంటున్నారు. అస్తమిస్తున్న సూర్యుని చిత్రాన్ని ఉంచకూడదని సూచిస్తున్నారు. 
     
  • వాస్తు శాస్త్రం ప్రకారం నటరాజ విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే ఎటువంటి కారణం లేకుండా అశాంతి కలుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఇంటి తగాదాలు మొదలవుతాయి. కాబట్టి ఇంట్లో నటరాజ విగ్రహాన్ని ప్రతిష్టించకూడదు. పురాణాల ప్రకారం, శివుడు కోపంగా ఉన్నప్పుడు మాత్రమే నృత్యం చేస్తాడు. అతని తాండవ కోప భంగిమలో జరుగుతుంది, ఇది నటరాజ రూపాన్ని చూపుతుంది, అంటే విధ్వంసం.
     
  •  సమాధి ఉన్న (తాజ్ మహల్)  చిత్రాన్ని ఎప్పుడూ ఉంచవద్దు. ప్రజలు తరచుగా తమ ఇళ్లలో ప్రేమకు చిహ్నంగా తాజ్ మహల్ చిత్రాన్ని ఉంచుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం, తాజ్ మహల్ ఒక సమాధి. అందువల్ల, అలాంటి చిత్రాల ద్వారా ఇంట్లో ప్రతికూల శక్తి ప్రసారం చేయబడుతుంది.