రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

వేములవాడ, వెలుగు​: వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం సాయంత్రమే వేములవాడ చేరుకున్న భక్తులు సోమవారం ఉదయాన్నే తలనీలాలు సమర్పించిన అనంతరం ధర్మగుండంలో స్నానాలు చేశారు. తర్వాత ధర్మదర్శనం, ప్రత్యేక దర్శనం, కోడెమొక్కు క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించి రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కోడెలు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఆఫీసర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.