అప్పట్లో ప్రధాని నెహ్రూకు ఆపరేషన్ చేసిన కరీంనగర్ డాక్టర్ కన్నుమూత

అప్పట్లో ప్రధాని నెహ్రూకు ఆపరేషన్ చేసిన కరీంనగర్ డాక్టర్ కన్నుమూత

కరీంనగర్ టౌన్, వెలుగు: భారత తొలి ప్రధాని జవహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాల్‌‌‌‌‌‌‌‌ నెహ్రూకు సర్జరీ చేసిన ప్రముఖ సర్జన్‌‌‌‌‌‌‌‌ కన్నుమూశారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన డాక్టర్ వి.భూంరెడ్డి(92) కిడ్నీ సమస్యతో బాధపడుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. ఐఎంఏ జాతీయ ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన ఉమ్మడి జిల్లాలో ఎందరో డాక్టర్లకు మార్గనిర్దేశకుడిగా నిలిచారు. ఉత్తర తెలంగాణలోనే మొదటి  జనరల్ సర్జన్ గా గుర్తింపు పొందారు. 

కరీంనగర్ లో మొట్టమొదటి ప్రైవేట్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించడంతోపాటు జిల్లాలోనే  ప్రైవేట్ రంగంలో తొలి ఆపరేషన్ నిర్వహించారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేంద్రంగా ఉమ్మడి ఏపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌ రాష్ట్రాల ప్రజలకు సేవలందించారు. భూంరెడ్డి మరణం పట్ల కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, సీపీఐ నేత చాడ వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి, సుడా చైర్మన్‌‌‌‌‌‌‌‌ కోమటిరెడ్డి నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి సంతాపం తెలిపారు.