లింగంపల్లి ఇందిరమ్మ కాలనీలో కరెంట్ పోల్స్

లింగంపల్లి ఇందిరమ్మ కాలనీలో కరెంట్ పోల్స్
  • మంత్రి వివేక్‌ వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్థులు 

చెన్నూరు, వెలుగు:  చెన్నూరు మండలంలోని లింగంపల్లి గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో కొత్త కరెంట్ పోల్స్, లైన్ పనులను స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా గ్రామస్తులు తమ కాలనీలో విద్యుత్ లైన్ లేదని మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లారు.  ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మంగళవారం కాంగ్రెస్ నాయకులతో కలిసి విద్యుత్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో కరెంట్ పోల్స్ వేశారు. లింగంపల్లి గ్రామంలో రూ.10 లక్షలతో  సీసీ రోడ్డు, తాగునీటి కోసం ఒక బోర్ వెల్  ఇప్పటికే మంత్రి వివేక్ వెంకటస్వామి వేయించారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.

  మంత్రి వివేక్ వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలిపారు.  మాజీ జడ్పీటీసీ కర్ణసాగర్ రావు,  పీఎస్సీఎస్ చైర్మన్ చల్లా రామిరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయిత హిమవంత రెడ్డి,మాజీ సర్పంచ్ అంగ రమేశ్, మాజీ ఎంపీటీసీ వెంకటస్వామి, గట్టు, సీపీఐ శ్రీనివాస్, రమేశ్ గౌడ్, పోచమ్మ  విద్యుత్ అధికారి ఏఈ, లైన్‌మెన్‌లు, గ్రామస్తులు పాల్గొన్నారు.