మలేషియాలో పురుగుల కూర తిన్నాను: కోహ్లీ

మలేషియాలో పురుగుల కూర తిన్నాను: కోహ్లీ

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి పరుగుల వరద పారించడం అంటే బాగా ఇష్టం. అందుకే జట్టేదైనా ధనాధన్ ఆటతో  సెంచరీలు, అర్థసెంచరీలు బాదుతూ ఉంటాడు. కోహ్లీకి రన్స్ చేయడంతో పాటు..తినడమంటే కూడా మహా ఇష్టం. అందుకే కోహ్లీని భోజన ప్రియుడు అంటారు. ఆస్ట్రేలియాతో  రెండో టెస్టు సందర్భంగా తనకు ఇష్టమైన ఆహారం " చోలె బాతుర్‌"ను  టీమిండియా సిబ్బంది తెచ్చినప్పుడు కోహ్లీ ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

అది కనిపిస్తే ఆగలేను..

ఆస్ట్రేలియాపై రెండో టెస్టులో విజయం సాధించిన తర్వాత విరాట్‌ కోహ్లీ సోషల్‌ మీడియాలో 'ఆస్క్‌ మీ ఎనీథింగ్‌' కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఈ సందర్భంగా అభిమానులు అతన్ని పలు ప్రశ్నలు అడిగారు. ఈ నేపథ్యంలో తనకు ఇష్టమైన ఆమారం "చోలె బాతుర్‌" అని చెప్పేశాడు. ఈ వంటకం కనిపిస్తే తాను తినకుండా ఆగలేనని తెలిపాడు. 

అదంటే నాకు అసహ్యం..

ఆహారంలో తనకు కాకరకాయ అంటే ఇష్టం ఉండదని కోహ్లీ వెల్లడించాడు. ప్రస్తుతం శాకాహారిని అని..అయితే తన జీవితంలో మాత్రం తినని కూర ఏదైనా ఉందంటే అది కాకరకాయ అని వివరించాడు. 

విచిత్ర వంటకంతో ఇబ్బంది పడ్డా..

మలేషియాలో తిన్న ఘోరమైన వంటకం గురించి కోహ్లీ వివరించాడు. అక్కడ ఓ  పురుగుల కూర తిన్నానని..అదేంటో తెలియకుండానే తిన్నట్లు చెప్పాడు.  ఫ్రై చేయడంతో బాగుంటుందని టేస్ట్ చేశానని..కానీ  రుచి చూశాక అసహ్యం వేసిందని  వెల్లడించాడు.