రావి ఆకుపై వివేక్ వెంకటస్వామి చిత్రం చెక్కిన కళాకారుడు

రావి ఆకుపై వివేక్ వెంకటస్వామి చిత్రం చెక్కిన కళాకారుడు

మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పుట్టిన రోజు సందర్భంగా తన అభిమానాన్ని చాటుకున్నాడు ఓ అభిమాని.  రావి ఆకుపై వివేక్ వెంకటస్వామి చిత్రాన్ని చెక్కాడు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కు చెందిన కళాకారుడు శివకుమార్ రావి ఆకుపై వివేక్ చిత్రాన్ని గీసి పుట్టిన రోజు కానుకగా అందజేశారు. ఈ సందర్భంగా  అభిమానికి వివేక్ వెంకటస్వామి కృతజ్ఞతలు తెలిపారు . 

వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు  పెద్దపల్లి జిల్లా  కేంద్రంలో  బీజేపీ నాయకులు ఘనంగా  నిర్వహించారు.  గొట్టిముక్కల  సురేష్ రెడ్డి  ఆధ్వర్యంలో  కేక్ కట్ చేసి, 2 వందల  మంది పేద మహిళలకు  చీరలు పంపిణీ చేశారు. బడుగు బలహీన  వర్గాల అభివృద్ధి  కోసం  నిరంతరం పని చేస్తున్నారని బీజేపీ నాయకులు అన్నారు. జన్మదిన  వేడుకల్లో బీజేపీ నాయకులు,  వివేక్ వెంకటస్వామి  అభిమాలు పాల్గొన్నారు.  

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో వివేక్ వెంకట స్వామి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వివేక్ వెంకట స్వామి బర్త్ డే పురస్కరించుకుని ఆయన అభిమానులు కేక్ కట్ చేసారు. తర్వాత పండ్లు పంపిణీ చేశారు.