
- ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాడుతున్న
- నా రాజకీయ భవిష్యత్‌పై వస్తున్న వార్తలు అవాస్తవం: వివేక్
హైదరాబాద్, వెలుగు : కేసీఆర్ నియంత పాలనకు ముగింపు పలకటానికి, ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాడుతున్నానని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. తన రాజకీయ భవిష్యత్‌పై తన ఒపీనియన్ తీసుకోకుండా కొన్ని మీడియాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని, నిరాధార కథనాలు, ఊహాగానాలేనని మంగళవారం ఓ ప్రకటనలో ఆయన స్పష్టం చేశారు. పెండ్లి వేడుకకు అటెండ్ కావడానికే అమెరికా వెళ్లానని ఆయన తెలిపారు. జై తెలంగాణ, జై బీజేపీ అని వివేక్ వెంకటస్వామి నోట్లో పేర్కొన్నారు.