ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానంపై కాసేపట్లో ఓటింగ్

ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానంపై  కాసేపట్లో ఓటింగ్

ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానంపై పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో కాసేపట్లో ఓటింగ్ జరగనుంది. అయితే ఇమ్రాన్ ఖాన్ పదవీ కోల్పోనున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీలోని 12 మంది సభ్యులతో పాటు.. మిత్ర పక్షానికి చెందిన ఏడుగు సభ్యులు అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చారు. దీంతో ఇమ్రాన్ ఖాన్ సర్కార్ మైనారిటీలో పడింది. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 342 మంది సభ్యులు ఉండగా.. సాధారణ మెజారిటీకి 172 మంది సభ్యుల మద్ధతు అవసరం ఉంటుంది. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి మిత్రపక్షాలతో కలిసి.. 176 మంది సభ్యుల బలం ఉంది. 25 మంది సభ్యులు ప్రతిపక్షాల అవిశ్వాత తీర్మానానికి మద్దతిచ్చారు. సాయంత్రం 4 గంటలకు దీనిపై ఓటింగ్ జరగనుంది. అంతకంటే ముందే ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ కు ముందే ఇమ్రాన్ ఖాన్ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని జాతీయ అతర్గత వ్యవహారాల మంత్రి ప్రకటించారు.