వనపర్తి, వెలుగు: ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేమని ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని సూచించారు.
రక్తదాన శిబిరం ద్వారా 252 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. దాతలకు ఎస్పీ ప్రశంసాపత్రం, పండ్లు అందజేసి అభినందించారు. ఏఆర్ ఏఎస్పీ వీరారెడ్డి, డీసీఅర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, సీఐలు ఎం కృష్ణయ్య, రాంబాబు, శివకుమార్, నరేశ్, ఆర్ఐలు అప్పలనాయుడు, శ్రీనివాస్, అరవింద్ పాల్గొన్నారు.
