వార్డెన్ సస్పెన్షన్.. ఔట్ సోర్సింగ్ సిబ్బంది తొలగింపు

 వార్డెన్ సస్పెన్షన్.. ఔట్ సోర్సింగ్ సిబ్బంది తొలగింపు
  • వార్డెన్ కొడుకుపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్

నారాయణ్ ఖేడ్, వెలుగు: హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్ తో పాటు ఇద్దరు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించినట్టు సంగారెడ్డి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ జగదీశ్ తెలిపారు. వార్డెన్ కొడుకుపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ఆయన తెలిపిన ప్రకారం.. జిల్లాలోని నారాయణఖేడ్ బీసీ బాలికల కాలేజీ హాస్టల్ వార్డెన్ కె.శారద, ఆమె కొడుకు వేధిస్తున్నట్లు కొందరు విద్యార్థినులు కొద్దిరోజుల కింద నారాయణఖేడ్ పోలీసులకు కంప్లయింట్ చేశారు. 

దీంతో జిల్లా కలెక్టర్ స్పందించి ఘటనపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్టు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ జగదీశ్​ పేర్కొన్నారు. కలెక్టర్ ఆదేశాలతో బాలికల హాస్టల్ లో విచారణ చేసినట్టు  తెలిపారు.  నివేదిక ఆధారంగా వార్డెన్ శారద ను సస్పెన్షన్ చేసినట్టు చెప్పారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా హాస్టళ్ల వార్డెన్లు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

చేర్యాలలో ముగ్గురు టీచర్ల సస్పెన్షన్  

చేర్యాల: డ్యూటీలో నిర్లక్ష్యం కారణంగా సిద్దిపేట జిల్లా మద్దూర్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ తోపాటు, ఇద్దరు పీజీటీలను సస్పెండ్ చేస్తూ బుధవారం మోడల్ స్కూల్ స్టేట్ డైరెక్టర్ శ్రీనివాసచారి ఉత్తర్వులు జారీ చేశారు. కొద్ది రోజుల కింద స్కూల్ ఎడ్యుకేషనల్ డైరెక్టర్  మోడల్ స్కూల్లో తనిఖీలు చేయగా.. స్కూల్ పరిసరాలు అపరిశుభ్రంగా కనిపించాయి. ప్రిన్సిపాల్ రూమ్ లో ల్యాబ్ మెటీరియల్ ఉండడం, కంప్యూటర్లు మూలన పడి ఉండడంతో ఆయనను వివరణ కోరగా సరైన సమాధానం చెప్పలేదు. స్కూల్ ప్రిన్సిపాల్ ఎ. గణేశ్, కెమిస్ట్రీ పీజీటీ ప్రమోదిని, జువాలజీ పీజీటీ మన్మధను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.