భర్త కళ్లెదుటే ఉరేసుకున్న భార్య.. వీడియో తీసిన భర్త

భర్త కళ్లెదుటే ఉరేసుకున్న భార్య.. వీడియో తీసిన భర్త
  • ఉరితాడుకు వేళాడుతూ విలివిలలాడినా ఆపే ప్రయత్నం చేయని భర్త

నెల్లూరు: భర్తతో గొడవపడిన ఓ ఇల్లాలు తీవ్ర మనస్తాపంతో భర్త కళ్లెందుటే ఉరేసుకుంటుంటే ఆపాల్సిన భర్త.. ప్రోత్సహించి ఆమె చావుకు కారణమయ్యాడు. నిజంగానే ఉరితాడు బిగించుకుని విలవిలా కొట్టుకుంటుంటే ఆపే ప్రయత్నమే చేయకుండా తాపీగా తన మొబైల్ ఫోన్లో వీడియో తీశాడు. భర్త కళ్లెదుటే ఆవేదనతో ఉరేసుకుని తనువు చాలించిన హృదయ విదారకపు ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరులో చోటు చేసుకుంది. 
కళ్లెదుటే కట్టుకున్న భార్య చస్తుంటే తాపీగా వీడియో తీసి పైశాచికానందం పొందిన భర్త సదరు వీడియోను బంధువులకు పంపాడు. దారుణమైన ఈ వీడియోలు చూసిన బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
బ్యాంకు ఏటీఎం వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న పెంచలయ్య.. ఆత్మకూరులోని మెప్మాలో రిసోర్సు పర్సన్ గా పనిచేస్తున్న కొండమ్మ భార్యా భర్తలు. భార్యా భర్తల మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. భర్త పెంచలయ్య ప్రవర్తనతో విసిగిపోయిన  కొండమ్మ తీవ్ర మనస్తాపానికి గురై నిన్న రాత్రి తన చీరతో ఫ్యాన్ కు  ఉరేసుకుంటుండగా.. భర్త పెంచలయ్య ఏ మాత్రం స్పందించలేదు. భార్య కొండమ్మ ఉరి వేసుకుంటుంటే ఆపే ప్రయత్నం చేయలేదు. ఉరికి వేళాడుతూ బాధతో గిలగిలా కొట్టుకుంటున్నా స్పందించి అడ్డుకోలేదు. భార్య తుదిశ్వాస విడిచే వరకు వీడియో తీసి..  అనంతరం సదరు వీడియోను కుటుంబ సభ్యులకు షేర్ చేశాడు. పెంచలయ్య తీరుపై కుటుంబ సభ్యులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు స్పందించి కేసు నమోదు చేశారు. 
భర్తతో విభేదాలతో మనస్తాపానికి గురై చనిపోయిన కొండమ్మ మృతి ఆమె పనిచేస్తున్న శాఖలోనే కాదు మహిళా ఉద్యోగినులను కదిలించింది. నిందితుడైన పెంచలయ్యపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మెప్మా సిబ్బంది బుధవారం ఆందోళన చేపట్టారు. దుర్మార్గపు భర్త పెంచలయ్యను కఠినంగా శిక్షించాలని  డిమాండ్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం..

సూసైడ్ నోట్: ఫొటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తాడనే ఆత్మహత్య

సామాన్యులను దహనం చేసి.. స్వామీజీలను ఎందుకు సమాధి చేస్తారంటే?

క్లైమాక్స్‌కు వచ్చిన తన్నులాట.. తెలంగాణ నువ్వెటు వైపు?

పోలీసుల పేర్లు మా డైరీలో రాసుకుంటాం