ఉద్యోగం మానేసి ఫుల్ టైం డాటర్ గా మారిన యువతి.. నెలకు రూ.47వేలు జీతం

ఉద్యోగం మానేసి ఫుల్ టైం డాటర్ గా మారిన యువతి.. నెలకు రూ.47వేలు జీతం

తల్లిదండ్రుల ఆలనాపాలనా కోసం ఓ కూతురు ఉద్యోగం మానేసింది. తమకు ఫుల్ టైం డాటర్ గా మారిపోయిన ఆ యువతికి ఆమె తల్లిదండ్రులు జీతం కూడా చెల్లిస్తున్నారు.

అత్యంత ఆసక్తిని కలిగించే ఈ ఘటన చైనాలో జరిగింది. నియానన్ అనే మహిళ ఏడాది క్రితం వరకూ ఓన్యూస్ ఏజెన్సీలో జాబ్ చేసేది. తీవ్ర ఒత్తిడికి గురవుతున్నా, ఉద్యోగం మానేయాలని అనుకున్నా జీవనోపాధి కష్టమైపోతుందని భావించిన నియానన్‌కు తల్లిదండ్రులు ఓ సలహా ఇచ్చారు. ఆ జాబ్ మానేయమని, తాము ఓ ఉద్యోగం ఇస్తామని భరోసా ఇచ్చారు. తమ మంచి చెడ్డలు చూసుకుంటే నెలకు 570డాలర్లు అంటే నెలకు సుమారు రూ.47వేల ఇస్తామని చెప్పారు. ఈ నిర్ణయాన్ని ఓకే చెప్పిన ఆమె.. తన ఉద్యోగం మానేసి ‘ఫుల్ టైం డాటర్’ జాబ్‌లో జాయిన్ అయ్యింది.
 
నిజానికి నియానన్‌‌కు ఈ జాబ్ చాలా బాగుందట. తల్లిదండ్రులతో మార్కెట్ కి వెళ్లడం.. వంట చేయడం.. డ్రైవింగ్ చేయడం.. వారితో కలిసి డ్యాన్స్ చేయడం.. నెలలో రెండు ట్రిప్‌లు వారిని బయటకు తీసుకువెళ్లడం.. ఇవే ఆమె ఉద్యోగంలో చేసే పనులు. నియానన్ తల్లిదండ్రులకు నెలకు లక్ష యువాన్ల వరకు అంటే దాదాపు రూ.11లక్షలకు పైగానే పెన్షన్ వస్తుందట.. అందులోనుంచి 4 వేల యువాన్లు కూతురికి జీతంగా ఇస్తున్నారు. ఆమెకు ఎంతకాలం ఈ జాబ్ లో కొనసాగాలనుకుంటే అంతకాలం కొనసాగమని.. లేదంటే తమతోనే ఉండమని కూడా తల్లిదండ్రులు ఆమెకు భరోసా ఇవ్వడం మరో చెప్పుకోదగిన విషయం.