
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వచ్చే పలు ప్రకటనలు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. వాటిని నమ్మి చాలా మంది అనేక ప్రొడక్ట్స్ కొని మోసపోతున్నారు. మరికొందరమో వారు చెప్పిన చిట్కాలు పాటించి కొన్నిసార్లు మంచి, కొన్నిసార్లు చెడు ఫలితాన్ని పొందుతున్నారు. అదే తరహాలో ఓ మహిళ తన పగిలిన మడమలకు చికిత్స చేసింది. అది కూడా ఓ ఫెవిక్విక్ ను ఉపయోగించి..
ఈ వీడియో టిక్‌టాక్ లో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వీడియోలో మహిళ తన పాదాలకు అయిన గాయాలకు సులభంగా చికిత్స చేస్తూ కనిపించింది. అందులో భాగంగా తన పగిలిన మడమలకు సూపర్‌గ్లూను పూసింది. సాధారణంగా అయితే ఇలాంటి సైన్సుకు సంబంధించిన విషయాల పరిష్కారం కోసం వైద్యులను సంప్రదించడం తప్పనిసరి. కానీ ఈ మహిళ మాత్రం తన సొంత ఐడియాను ఉపయోగించింది. పామోప్లాంటర్ కెరటోడెర్మా (పీపీకే) అనే వ్యాధితో నిరంతరం బాధపడేవారు సులభంగా లభించే సూపర్‌గ్లూను ఉపయోగించమని సిఫార్సు చేసింది. ఆ తర్వాత ఆమె వేలి కొనను ఉపయోగించి మడమలకు జిగురును కూడా అంటించింది. అనంతరం అది ఎలా ఎండిపోయిందో, దీని వల్ల పగుళ్లు కూడా నయం అవుతున్నాయని ఆమె వీడియోలో చూపించింది.
“ఇది చౌకైన, చెత్త రకమైన సూపర్‌గ్లూ అని నాకు తెలుసు. కానీ ఇది నా దగ్గర ఉంది. దీన్ని మీరు ఎక్కడైనా ప్రారంభించవచ్చు. కాబట్టి నేను కొన్ని మెడికల్-గ్రేడ్ సూపర్‌గ్లూస్ లేదా స్కిన్ గ్లూస్‌లో పెట్టుబడి పెట్టడానికి ముందు, ముందు దీనితో ప్రయత్నించాలని అనుకున్నాను" అని ఆ మహిళ వీడియోలో చెప్పుకొచ్చింది. హైస్కూల్ చదువుతున్న సమయంలో తాను సూపర్‌గ్లూ హ్యాక్‌ని ఉపయోగించానని, ఆ సమయంలో తనకు పెద్ద పగుళ్లు వచ్చిందని ఆ మహిళ తెలిపింది. కానీ అది చాలా మందంగా, గట్టిగా ఎండిపోయి, ఆమెకు చాలా అసౌకర్యంగా అనిపించింది. వ్యాధితో బాధపడుతున్న చాలా మంది తనను ఇలా చేయమని, సూపర్‌గ్లూ హ్యాక్‌ను సిఫార్సు చేశారని చెప్పింది. చివరకు అలా తాను ఉపయోగించడానికి అంగీకరించానని చెప్పారు.
ఈ వీడియో వైరల్ కావడంతో, ఈ విషయంపై ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు ఆ మహిళకు చాలా సపోర్టివ్ గా నిలిచారు. పగిలిన మడమల చికిత్సలో సూపర్‌గ్లూ నిజంగా సహాయపడుతుందని అంగీకరించారు. మరికొందరు వైద్యుల సలహా తీసుకోకుండా ఇలా చేయడంపై ఆమెను ట్రోల్ చేసారు, ఎందుకంటే ఇది వివిధ ఇన్‌ఫెక్షన్లకు దారితీసే ప్రమాదం ఉంటుంది.