
సింగపూర్‌లో ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ మరణంపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా, అస్సాం పోలీస్ సర్వీస్ (APS) అధికారి సందీపన్ గార్గ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గాయకుడి బంధువు అయిన సందీపన్, సింగపూర్‌లో జుబీన్ మరణించినప్పుడు అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు గతంలోనే అతన్ని, మరికొంతమంది సన్నిహితులను ప్రశ్నించారు.
గౌహతిలోని స్థానిక కోర్టు బుధవారం రోజున APS అధికారి సందీపన్ గార్గ్‌ను ఏడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించింది. అస్సాం పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సందీపన్ గార్గ్‌ను అరెస్టు చేయగా... SIT చీఫ్ & స్పెషల్ డీజీపీ ప్రసాద్ గుప్తా మాట్లాడుతూ, కోర్టు సందీపన్ గార్గ్‌ను ఏడు రోజుల పోలీసు కస్టడీకి పంపింది అని తెలిపారు.
►ALSO READ | మేనరికం పెళ్లిళ్లపై నిషేధం దిశగా యూకే.. జన్యు సమస్యలపై పెరుగుతున్న ఆందోళనలు..
ఈ కేసులో SIT ఇప్పటివరకు సందీపన్ గార్గ్‌తో కలిపి మొత్తం ఆరుగురిని అరెస్టు చేసింది. వీరిలో సింగపూర్‌లో జుబీన్ గార్గ్ చివరిగా పాల్గొన్న ఈవెంట్‌తో సంబంధం ఉన్న ఈవెంట్ నిర్వాహకుడు శ్యామ్‌కాను మహంత, గాయకుడి మేనేజర్ సిద్ధాంత్ శర్మ, బ్యాండ్‌మేట్ శేఖర్ జ్యోతి గోస్వామి, కో-సింగర్ అమృత్‌ప్రవ మహంత ఉన్నారు.
అయితే గాయకుడి మరణం జరిగిన రోజున యాచ్ పార్టీలో సింగపూర్‌లో స్థిరపడిన అస్సామీ వ్యక్తి రూప్‌కమల్ కలిత ఉన్నట్లుగా తెలియడంతో, ఇతను విచారణ కోసం SIT ముందు హాజరయ్యారు