
యూకేలో మేనరికం పెళ్లిళ్లపై ఆరోగ్యకరమైన సమస్యల కారణంగా నిషేధం విధించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 2025లో ఆ దేశంలో ఒక మాజీ కన్జర్వేటివ్ మంత్రివర్యుడు రిచర్డ్ హోల్డెన్, మేనరికం పెళ్లిళ్లకు నిషేధం పెట్టాలనే బిల్లు ప్రవేశపెట్టాడు. మేనరికం పెళ్లిళ్లతో జన్యు విధ్వంసక రోగాలు, జ్ఞాపకశక్తి, మాట్లాడే సమస్యలు పిల్లల్లో బాగా పెరుగుతాయి. అయితే దీన్ని నిషేధించడం కాకుండా జన్యు పరీక్షలు, అవగాహన కార్యక్రమాల ద్వారా సమస్యలను పరిష్కరించాలి అనే వాదన కూడా ఉన్నాయి.
యూకేలో ముఖ్యంగా పాకిస్థాన్ నుంచి వలస వచ్చిన ఫ్యామిలీల్లో మేనరికం పెళ్లిళ్లు ఎక్కువగా ఉంటాయని, దీనికి వైద్య, సాంస్కృతిక రెండు కోణాల్లో పరిష్కారం అవసరని అంటున్నారు. మరో పక్క భారతదేశంలో ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో మేనరికం పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. సుమారు 13.6% పెళ్లిళ్లు ఇలాంటి రక్త సంబంధాల మధ్య జరుగుతుంటాయని.. ఏపీ, తమిళనాడులో అధిక సంఖ్యలో ఇలాంటి పెళ్లిళ్లు ఉంటున్నట్లు తెలింది. ముస్లిం, క్రైస్తవ మతాల్లో మేనరికం పెళ్లిళ్లు ఎక్కువగానే ఉంటున్నట్లు గుర్తించబడింది.
ఈ పెళ్లిళ్లలో బావ, మరదలు, మేనమామ, మేనకోడలు వంటి దగ్గరి బంధువులు వివాహమవడం సర్వసాధారణం. అయితే వీటి వల్ల ఆ జంటలకు పుట్టే పిల్లల్లో జన్యుపరమైన లోపాలు, శారీరక, మానసిక సమస్యలు, నాడీ వ్యాధులు, థలసేమియా వంటి అనారోగ్యాలను పెంచుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. భారతదేశంలో ముస్లిం సమూహాలలో కూడా మేనరికం పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతుండటంతో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.
ALSO READ : ఇలాంటి కంపెనీ కూడా ఉందా
ప్రస్తుతం యూకేలో మేనరికం పెళ్లిళ్లపై చట్టపరమైన నిషేధం కోసం ప్రయత్నాలు ఉన్నాయి. కానీ సాంస్కృతిక, ఆరోగ్య వాదనలతో విభేదాలు ఉన్నాయి. యూకేలో మేనరికం పెళ్లిళ్లపై చట్ట పరమైన నిషేధం కోసం డిమాండ్లు ఉన్నా.. ఇంకా తుది నిర్ణయం రావాల్సి ఉంది. డేటా ప్రకారం దక్షిణ భారతదేశంలో ఇలాంటి మేనరికం పెళ్లిళ్ల రేటు 53 శాతంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని యూకే డిమాండ్ల ద్వారా తెలుస్తోంది.