బెంగళూరు సెంట్రల్ లోక్సభలో లక్షా 250 ఓట్లు చోరీ.. 40 వేలకు పైగా ఫేక్ అడ్రెస్తో ఓటర్లు: రాహుల్ గాంధీ

బెంగళూరు సెంట్రల్  లోక్సభలో లక్షా 250 ఓట్లు చోరీ.. 40 వేలకు పైగా ఫేక్ అడ్రెస్తో ఓటర్లు: రాహుల్ గాంధీ

బీజేపీ కోసం ఎన్నికల కమిషన్ ఓట్ల చోరీకి పాల్పడుతోందని పదే పదే ఆరోపిస్తూ వస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఓట్ల చోరీకి సంబంధించి పెద్ద బాంబునే పేల్చారు. కర్ణాటక, మహారాష్ట్ర, హర్యాణా ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందన్న రాహుల్.. కర్ణాటకలో ఒక్క లోక్ సభ స్థానంలోనే లక్షల ఓట్ల చోరీ  ఎలా జరిగిందో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో వివరించారు.

బెంగళూర్ సెంట్రల్ లోక్ సభ స్థానంలో లోని మహదేవ్ పుర అసెంబ్లీ సెగ్మెంట్ లో మొత్తం ఒక లక్ష 250 ఓట్లు చోరీ అయినట్లు చెప్పారు. అయితే 40 వేల 9 అడ్రెస్ లు ఇన్ వ్యాలిడ్ అడ్రెస్ లు ఉన్నట్లు ఆరోపించారు. అదే విధంగా ఒకే అడ్రస్ పై బల్క్ ఓటర్లు 10 వేల 452 ఉన్నట్లు చెప్పారు. ఓటర్ లిస్టులో ఇన్వాలిడ్ ఫోటోస్ 4132 ఉన్నట్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వార చూపించారు. ఇక  33 వేల 692 సార్లు ఫార్మ్ 6 మిస్ యూస్ జరిగిందని తెలిపారు రాహుల్. 

ALSO READ : ED ఆఫీసర్.. రిటైర్ అయ్యి రిలయన్స్ లో జాయిన్ అయ్యాడు

సెంట్రల్ లోక్ సభలో  మొత్తం ఓట్లలో కాంగ్రెస్  అభ్యర్థికి 6 లక్షల 26 వేల ఓట్లు నమోదవ్వగా.. బీజేపీ అభ్యర్థికి 6 లక్షల 58 వేల ఓట్లు పడ్డాయి. ఇందులో లక్ష ఓట్ల చోరీ జరిగిందని.. దీంతో బీజేపీ అభ్యర్థి గెలిచినట్లు చెప్పారు రాహుల్. కాంగ్రెస్ అభ్యర్థి మన్సూర్ అలీ ఖాన్ చాలా వరకు లీడ్ లో ఉన్నప్పటికీ.. ఫైనల్ గా మార్జిన్ 38 వేల 7 వందలతో బీజేపీ క్యాండిడేట్ గెలిచినట్లు చెప్పారు. చివరి 30 సెకండ్లలో ఫ్రాడ్ జరిగిందని మన్సూర్ ఆరోపించిన సంగతి గుర్తు చేశారు. 

 మహదేవ్ పుర అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థికి లక్ష 15 వేల 586 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థికి 2 లక్షల 29 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. మార్జిన్ లక్షా 14 వేలుగా ఉంది. అయితే ఈ స్థానంలో మొత్తం 11 వేల 965 వేలకు పైగా ఫేక్ ఓట్లు ఉన్నట్లు తెలిపారు. మహదేవ్ పుర అసెంబ్లీ నియోజకవర్గం ఉన్న బెంగళూర్ సెంట్రల్ లోక్ సభలో లక్షా 250 ఓట్ల చోరీ జరిగిందని తెలిపారు.