నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలో పెను విషాదం చోటు చేసుకుంది. పెంబి మండల కేంద్రానికి చెందిన గోసుకుల రాములు, కన్నె మల్లేష్‌లకు చెందిన సుమారు 10 ఎకరాల మొక్కజొన్న పంట ప్రమాదవశాత్తు చెలరేగిన మంటల్లో పూర్తిగా దగ్ధమైంది.
రెక్కలు ముక్కలు చేసుకుని సాగు చేసిన పంట కోతకు వచ్చే సమయంలో ఇలా అగ్నికి ఆహుతి కావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. లక్షలాది రూపాయల పెట్టుబడి బూడిదైందని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ALSO READ : ఇంత క్రూరంగా ఉన్నావేంట్రా బాబు:
మంటలు చెలరేగిన విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు మరింత వ్యాపించకుండా ఆర్పేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఒకేసారి 10 ఎకరాల పంట కాలిపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

