నిర్మల్ జిల్లా కేంద్రంలోని కురాన్నపేట చెరువులో విషాదం చోటుచేసుకుంది. గుర్రపు డెక్కకు మూగజీవాలు బలయ్యాయి. గుర్రపు డెక్కలో చిక్కుకోని ఊపిరి అడక ప్రాణాలు 10 గేదెలు మృతి చెందాయి.
జనవరి 8న యంత్రంలోగా ఇంటికి చేరుకోవాల్సిన గేదెలు రాత్రి ఇంటికి రాకపోవడంతో గేదెల యజమానులు, రైతులు పలుచోట్ల గాలింపు చర్యలు చేపట్టగా చెరువులో చిక్కుకున్నట్టు గుర్తించారు. ఈ మేరకు వెంటనే కాలనీ అధ్యక్షులు నరేందర్ కు సమాచారాన్ని తెలుపడంతో అతను మున్సిపల్ సిబ్బందికి సమాచారాన్ని అందించారు. వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు జేసీబీ సహాయంతో చెరువులో గుర్రపు డెక్కలో చిక్కుకుపోయిన గేదెలను బయటకి తీశారు. అప్పటికే ఊపిరి ఆడక సుమారు 10 గేదేలు మృత్యువాత పడ్డాయి . మరోక 90 గేదేలను స్థానికులు కాపాడారు. దాదాపు పది లక్షల నష్టం జరిగిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
