నిర్మల్ జిల్లా కడ్తాల్ వద్ద 10కిమీ మేర ట్రాఫిక్ జామ్

V6 Velugu Posted on Jul 22, 2021

  • హైదరాబాద్ –నాగ్ పూర్ మధ్య రాకపోకలకు అంతరాయం

నిర్మల్ జిల్లా: భారీ వర్షాలకు నిర్మల్ జిల్లా పరిసర ప్రాతాలు అతలాకుతలం అవుతున్నాయి. వాన దేవుడికి కోపం వచ్చిందేమో.. మొగులుకు చిల్లుపడ్డదేమో అన్నట్లు ఇవాళ ఉదయం నుంచి వర్షం దండిచికొడుతోంది. కడ్తాల్ వద్ద జాతీయ రహదారి 44 రోడ్డుపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో 10కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్ –నాగ్ పూర్ మద్య రాకపోకలకు తీవ్ర  అంతరాయం కలుగుతోంది. వాన ఉధృతితో రోడ్లన్నీ చెరువులుగా మారి సరిగా కనపడని పరిస్థితి. ప్రమాదాలకు గురికావాల్సిన పరిస్థితి నెలకొనడంతో వర్షం తగ్గే వరకు వీలైనంత వరకు ప్రయాణం వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. 
 

Tagged , nirmal district today, heavy rains in Nirmal district, Nirmal district Kadthal today, Kadthal NH 44, 10km traffick jam, Hyderabad -Nagpur road heavy trafic jam

Latest Videos

Subscribe Now

More News