మెదక్ జిల్లాలో 10 నామినేషన్లు

మెదక్ జిల్లాలో 10 నామినేషన్లు

మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు : ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా శనివారం మొత్తం 10 నామినేషన్లు  దాఖలయ్యాయి. సిద్దిపేట జిల్లాలోని 4 సెగ్మెంట్లలో మొత్తం 6 నామినేషన్లు దాఖలయ్యాయి. సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పైసా రామకృష్ణ, పిల్లి సాయికుమార్ నామినేషన్ లు దాఖలు చేశారు. దుబ్బాక అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తరపున నియోజకవర్గ కన్వీనర్ ఎస్.ఎన్.చారి,  ఇండిపెండెంట్ అభ్యర్థిగా గండి భుజంగం నామినేషన్లు  దాఖలు చేశారు. హుస్నాబాద్ అసెంబ్లీ స్థానానికి  ఇండిపెండెంట్ అభ్యర్థిగా కడతల అనిల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.

గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి ఎలాంటి  నామినేషన్ దాఖలు కాలేదు. సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్ అసెంబ్లీ స్థానానికి ఇండిపెండెంట్​అభ్యర్థులు బక్క మల్లేశం, బేకరీ అమోస్ నామినేషన్లు దాఖలు చేయగా,  జహీరాబాద్  అసెంబ్లీ స్థానానికి  కాంగ్రెస్  అభ్యర్థి చంద్రశేఖర్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. మెదక్​ జిల్లాలోని మెదక్​ అసెంబ్లీ స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నాగరాజు గౌడ్​ నామినేషన్​ దాఖలు చేశారు. నర్సాపూర్​ అసెంబ్లీ స్థానంలో ఒక్క నామినేషన్​ కూడా దాఖలు కాలేదు.