ఇయ్యాల్టి నుంచి బడుల్లో 100 రోజుల ‘రీడ్’ ప్రోగ్రామ్

 ఇయ్యాల్టి నుంచి బడుల్లో 100 రోజుల ‘రీడ్’ ప్రోగ్రామ్
  •     ఈనెల 14 నుంచి 21 దాకా గ్రంథాలయ వారోత్సవాలు
  •     గైడ్​లైన్స్ జారీ చేసిన విద్యాశాఖ

హైదరాబాద్, వెలుగు: స్టూడెంట్లలో చదివే సామర్థ్యాన్ని, ఆసక్తిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ రూపొందించిన రీడ్ (రీడ్, ఎంజాయ్ అండ్ డెవలప్) ప్రోగ్రామ్ రాష్ట్రంలో శనివారం నుంచి ప్రారంభం కానుంది. 100 రోజుల పాటు ఈ ప్రోగ్రామ్ కొనసాగనుంది. ఫస్ట్ క్లాస్ నుంచి 9వ తరగతి దాకా స్టూడెంట్లను ఇందులో భాగస్వామ్యం చేయనున్నారు. అన్ని మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ల పరిధిలోని బడుల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. రీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన గైడ్ లైన్స్​ను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన శుక్రవారం విడుదల చేశారు. ఈ విద్యాసంవత్సరం పూర్తయ్యే సరికి స్టూడెంట్లతో బాగా చదివించాలని, చదవడం స్టూడెంట్లకు ఓ అలవాటుగా మార్చాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. రీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా ప్రతి పీరియడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 10 నిమిషాలపాటు చదివించనున్నారు.

కరోనాతో స్టూడెంట్లలో తగ్గిన ఆసక్తి

కరోనా వ్యాప్తితో స్కూళ్లు చాలా రోజులు మూత బడ్డాయి. బడులకు దూరంగా ఉండటంతో స్టూడెంట్లలో చదివే ఆసక్తి తగ్గిపోయింది. దీంతో చదవడం, రాయడంపై ఆసక్తి పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రీడ్ ప్రోగ్రామ్​ను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు రూపొందించారు. శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బడుల్లో అమలు చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా రోజూ తప్పనిసరిగా టీచర్ బోధించే పాఠాన్ని 10 నిమిషాల పాటు స్టూడెంట్లతో చదివించాలి. చదివిన అంశంలో కీలక పదాలను గుర్తించి, బ్లాక్ బోర్డుపై రాయించాలి. రోజూ లైబ్రరీకి ఓ పీరియడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేటాయించాలి. మూడు రోజులు మాతృభాషలోని కథల పుస్తకాలు, రెండు రోజులు ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కథల పుస్తకాలు, ఒక రోజు సెకండ్ లాంగ్వేజీ లోని కథలను చదివించాలి. ప్రైమరీ స్కూళ్లలో ఐదుగురు స్టూడెంట్లతో కమిటీని, హైస్కూళ్లలో ఆరు నుంచి 9వ తరగతి దాకా ఒక్కో క్లాస్​కు లైబ్రరీ కమిటీని ఏర్పాటు చేయాలి. పుస్తకాలు ఇవ్వడం, తీసుకోవడం వంటి పనులు రిజిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాసే బాధ్యతలను ఆ కమిటీ సభ్యులే నిర్వహించాల్సి ఉంటుంది.

పోటీలు పెట్టాలె

పిల్లల మధ్య ప్రతి శనివారం చదివే పోటీలు నిర్వహించాలని హెడ్మాస్టర్లకు ఆఫీసర్లు సూచించారు. కథలు చెప్పడం, చదివిన దాని గురించి మాట్లాడించడం వంటి అంశాల్లో పోటీలు నిర్వహించాలి. బాగా చదివే వారికి  చిన్న గిఫ్టులు లేదా చప్పట్లతోనైనా ప్రోత్సహించాలి. ఈనెల 14 నుంచి 21 దాకా బడుల్లో గ్రంథాలయ వారోత్సవాలు జరపాలి. 21న అన్ని బడుల్లో పేరెంట్స్, గెస్టులను పిలిచి మాతృభాషా దినోత్సవం నిర్వహించాలి. ఈ కార్యక్రమాన్ని హెడ్మాస్టర్లతోపాటు ఎంఈఓలు, డీఈఓలు పర్యవేక్షించాలి. హెచ్ఎంలు నెలకోసారి టీచర్లతో సమీక్షించాలి. ప్రతి ఎంఈఓ నెలలో కనీసం 10 ప్రైమరీ, 2 యూపీఎస్, ఒక హైస్కూల్ సందర్శించాలి. మండల స్థాయిలో ఐదుగురు సబ్జెక్టు ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో కోర్ టీమ్ ఏర్పాటు చేయాలి. డీఈఓలు నెలలో కనీసం మూడు మండలాల్లో పర్యవేక్షించాలి. డీఈఓ 6 ప్రైమరీ, 3 యూపీఎస్/హైస్కూళ్లను సందర్శించాలి. జిల్లాస్థాయిలో 10 మందితో ఓ కోర్ కమిటీ ఏర్పాటు చేయాలి. స్టేట్ లెవెల్​లోనూ ఓ కమిటీ ఉంటుంది.