10 కిలోల గంజాయి పట్టివేత.. ఐదుగురి అరెస్టు

 10 కిలోల గంజాయి పట్టివేత.. ఐదుగురి అరెస్టు

అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఐదుగురిని శంషాబాద్‌ ఎస్‌ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరాంఘర్‌ వద్ద నిర్వహిస్తున్న తనిఖీల్లో వీరి వద్ద నుంచి 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఐదుగురు ఒరిస్సా నుంచి ప్రైవేటు ట్రావెల్స్‌లో నగరానికి వచ్చారని పోలీసులు తెలిపారు. ఎండు గంజాయిని ప్లాస్టిక్‌ కవర్లలో ప్రత్యేకంగా ప్యాకింగ్‌ చేసి తరలిస్తున్నారు. ఒక్కొక్కరు 2 కిలోల గంజాయిని నగరానికి తీసుకువచ్చారు. నిందితులను అరెస్టు చేసి ఎస్ఓటీ పోలీసులు.. తదుపరి విచారణ కోసం రాజేంద్రనగర్‌  పోలీసులకు అప్పగించారు.