ఫాంహౌజ్ లో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్య

ఫాంహౌజ్ లో ఒకే కుటుంబానికి చెందిన  11 మంది ఆత్మహత్య

రాజస్థాన్‌లో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఫాంహౌజ్ లో ఆత్మహత్య చేసుకున్నారు. వీరంతా పాకిస్థాన్ నుంచి రాజస్థాన్ కు వచ్చిన హిందూ వలసదారులు. ఈ దారుణ ఘటన జోధ్‌పూర్ జిల్లాలోని డెచు ప్రాంతంలో ఉన్న లోడ్టా గ్రామంలో చోటుచేసుకుంది. వీరంతా పాకిస్తాన్ లోని భిల్ వర్గానికి చెందిన హిందూ వలసదారులు. వీరు 2012లో రాజస్థాన్ కు వచ్చి ఒక ఫాంహౌజును అద్దెకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు.

ఆత్మహత్యకు పాల్పడిన 11 మందిలో ఒక వ్యక్తి చావుబతుకుల మధ్య ఉన్నట్లు పోలీసు సూపరింటెండెంట్ రాహుల్ బర్హాట్ తెలిపారు. ‘ఈ ఘటన శనివారం రాత్రి జరిగి ఉంటుందని అనుకుంటున్నాం. వీరంతా పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందూ వలసదారులు. వీరందరూ విషం తాగినట్లు తెలుస్తోంది. వారి నివాసానికి చుట్టు పక్కల మొత్తం విష రసాయనాల వాసన వస్తోంది. వారిలో ఒక వ్యక్తి కొనప్రాణంతో ఉన్నాడు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం. వారి సామూహిక ఆత్మహత్యలకు కారణం తెలియలేదు. ఆస్పత్రిలో ఉన్న వ్యక్తి కోలుకుంటే.. ఏం జరిగిందో తెలుస్తుంది. మృతదేహాలపై ఎటువంటి గాయం లేదు. ప్రాథమిక దర్యాప్తులో కుటుంబ సమస్యల కారణంగానే వారందరూ ఆత్మహత్యకు పూనుకున్నారని తెలుస్తోంది’ అని ఆయన తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించారు.

For More News..

సర్ ప్రైజ్.. అంత్యక్రియలు చేసిన రెండు రోజుల తర్వాత తిరిగొచ్చిన వ్యక్తి

నేడు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి పీఎం కిసాన్ నగదు

దేశంలోనే మొదటిసారి అత్యధిక కరోనా కేసులు