గురుకులంలో ఫుడ్​ పాయిజన్ ​ఘటనపై విచారణ కమిటీ

 గురుకులంలో ఫుడ్​ పాయిజన్ ​ఘటనపై విచారణ కమిటీ

విషమంగానే ప్రశాంత్​ పరిస్థితి  

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా భువనగిరిలోని గురుకులంలో శుక్రవారం రాత్రి ఫుడ్​ పాయిజన్ ​కారణంగా పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఇందులో ప్రశాంత్​అనే స్టూడెంట్​ఆరోగ్యం ఇంకా మెరుగుపడలేదు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఇతడిని హైదరాబాద్ ​రెయిన్​బో హాస్పిటల్​ఐసీయూ వార్డులో ఉంచి ట్రీట్​మెంట్ ​అందిస్తున్నారు. ఆదివారం వరకూ  ఆరోగ్యం విషమంగానే ఉందని డాక్టర్లు చెప్పారు. మరోవైపు కృష్ణ అనే విద్యార్థిని ఉప్పల్​లోని ఓ ప్రైవేట్​ హాస్పిటల్​కు తరలించగా కోలుకున్నట్టు తెలిసింది. భువనగిరి ఏరియా హాస్పిటల్​లో 11 మంది  చికిత్స పొందుతున్నారు. ఇద్దరు హైదరాబాద్​లోని ఉస్మానియా హాస్పిటల్​లో చికిత్స పొందుతున్నారు. 

రిపోర్టు తర్వాత చర్యలు

గురుకులంలో ఫుడ్​ పాయిజన్​ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. దీంతో గురుకుల విద్యాలయ సంస్థ సెక్రెటరీ అనంతలక్ష్మి ఆధ్వర్యంలో పెనేషియా ఓఎస్​డీ ప్రశాంతి, విజిలెన్స్​ఆఫీసర్ ​హుస్సేన్​ ఎంక్వైరీ చేయనున్నారు. ఈ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకోనున్నారు.