వయసు 11..ఐక్యూ 162.!

వయసు 11..ఐక్యూ 162.!

లండన్: మెన్సా టెస్టు. ఈ పేరు వినగానే చాలా మంది అమ్మో అంటారు! పేపర్ లో ప్రశ్నలు చూడగానే కళ్లు పులిబొంగరాల్లా తిరిగేస్తాయంటూ చమత్కరిస్తారు! కానీ ఓ పదకొండేళ్ల పాప.. మెన్సా టెస్టుకే కళ్లు తిరిగేలా చేసింది! టెస్టులో పూర్తి స్థాయి మార్కులు సాధించింది. ఆమె ఐక్యూ 162 అని నిపుణులు తేల్చారు. ఆమె పేరు జియా వదూచా. భారతసంతితి అమ్మాయే. ఈ విషయం తెలుసుకున్న ఆమె పేరెంట్స్ తో సహా అందరూ అవాక్కయ్యారు. మెన్సా ఆఫీసర్లు జియాకు ఎలైట్ మెంబర్ షిప్ ను ఆఫర్ చేశారు. ఇప్పుడు ఆమెను స్కూల్లో పిల్లలు ఆటోగ్రాఫ్ అడుగుతున్నారు. జియా పేరెంట్స్ బైజల్, జిగ్నేశ్ బ్రిటన్ లో స్నెల్ సొల్యూషన్స్ లిమిటెడ్ అనే కన్సల్టెన్సీని రన్ చేస్తున్నారు. జియాకు తన కంపెనీలో పని చేయడం ఇష్టం లేదని తల్లి బైజల్ చెప్పారు. ఆమె కెరీర్ లో ఏదైనా సాధించాలని అనుకుంటోందన్నారు. అందుకు తగ్గట్టే తమ ప్రోత్సాహం ఉంటుందని వెల్లడించారు. మెన్సా టెస్టు విజేతలను అల్బర్ట్ ఐన్ స్టీన్, స్టీఫెన్ హాకింగ్ లాంటి సైంటిస్టులతో పోల్చడాన్ని నిర్వహకులు తప్పుబట్టారు. వాళ్లు ఇలాంటి టెస్టు తీసుకున్నారన్న దాఖలాలు
లేవని చెప్పారు.