బాల్కొండ మండలంలో 28 గ్రామాలు..బరిలో 111 మంది సర్పంచ్ అభ్యర్థులు

బాల్కొండ మండలంలో 28 గ్రామాలు..బరిలో 111 మంది సర్పంచ్ అభ్యర్థులు

బాల్కొండ, వెలుగు: ఉమ్మడి బాల్కొండ మండలంలో 28 గ్రామాలకు 111 మంది అభ్యర్థులు సర్పంచ్ బరిలో నిలిచారు. బాల్కొండ మండలంలో అత్యధికంగా బాల్కొండ సర్పంచ్ స్థానానికి 10 మంది పోటీ చేస్తున్నారు.చిట్టాపూర్ లో 8మంది బరిలో నిలిచారు.బాల్కొండ మండలంలోని 10 గ్రామ పంచాయతీ స్థానాలకు 46మంది,7పంచాయతీలు ఉన్న ముప్కాల్ లో 30 మంది పోటీలో ఉండగా,వెంచిర్యాల్ సర్పంచ్ గా నిమ్మల రాజమణి ఏకగ్రీవం అయ్యారు. 

మెండోరా మండలంలోని 11 గ్రామాలకు 35మంది పోటీ చేస్తున్నారు.ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ఇప్పటికే కుల సంఘాలకు తాయిలాలు అందిస్తున్నారు.ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తామని బాండ్ పేపర్ల ప్రచారం కొనసాగిస్తున్నారు. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరికంటే ఎక్కువగా అభ్యర్థులు పోటీలో నిలవగా ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక లీడర్లకు తలనొప్పిగా మారింది.