కామారెడ్డి జిల్లాలో భారీగా పీడీఎస్‌ బియ్యం పట్టివేత

కామారెడ్డి జిల్లాలో భారీగా పీడీఎస్‌ బియ్యం పట్టివేత

నస్రుల్లాబాద్, వెలుగు:  కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌ మండలంలో అక్రమంగా తరలిస్తున్న 12 క్వింటాళ్ల బియ్యాన్ని బాన్సువాడ పోలీసులు పట్టుకున్నారు. బియ్యం అక్రమ రవాణాపై పక్కా సమాచారంతో బాన్సువాడ ఏఎస్సై సీతారామలక్ష్మి, సిబ్బందితో కలిసి సోమవారం తెల్లవారుజామున దుర్కి గ్రామ చౌరస్తాలో నిఘా ఉంచారు. హైదరాబాద్‌ నుంచి గాంధారి మీదుగా కోటగిరికి తరలిస్తున్న 12 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు. 

వెహికల్‌తో పాటు డ్రైవర్‌ అజీజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసిన బియ్యాన్ని రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో బాన్సువాడ ప్రభుత్వ గోదాంలో జమ చేశామని నస్రుల్లాబాద్‌ ఎస్సై రాఘవేంద్ర తెలిపారు. డ్రైవర్‌,  వాహన యజమానిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.