బట్లర్ మెరుపు సెంచరీ..ముంబైకి భారీ టార్గెట్

బట్లర్ మెరుపు సెంచరీ..ముంబైకి భారీ టార్గెట్

ఐపీఎల్ సీజన్-15లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్ తో ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరుగుతుంది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 రన్స్ చేసింది. ప్రారంభంలోనే కీలక 2 వికెట్లు పోయినప్పటికీ జోస్ బట్లర్ చెలరేగి ఆడటంతో రాజస్థాన్ భారీ స్కోర్ చేసింది. ఈ క్రమంలోనే బట్లర్ మెరుపు సెంచరీ (100) చేశాడు. అతడికి తోడు ఆర్ఆర్ కెప్టెన్ సంజు శాంసన్(30) కూడా ఫర్వాలేదనిపించాడు. చివర్లో హెట్ మేయర్(34) రాణించడంతో రాజస్థాన్ ఛాలెంజింగ్ స్కోర్ చేసింది.  మరి ఈ సీజన్ లో ఇప్పటివరకు బోణీ చేయని ముంబై ఈ బిగ్ టార్గెట్ ను అందుకుని విజయం సాధిస్తుందా లేదా అనేది చూడాలి.

ముంబై బౌలర్లలో బుమ్రా(3), టైమల్ మిల్స్(3), పోలార్డ్(1) వికెట్లు తీశారు.

ఇవి కూడా చదవండి

సామాన్యులకో రూల్.. అధికారుల బంధువులకో రూల్

ఆర్యన్ ఖాన్ కేసులో కీలక సాక్షి మృతి

వేగంగా వ్యాపిస్తున్న మరో కొత్త వేరియంట్

రష్యా భూభాగంపై ఉక్రెయిన్ అటాక్