
బిహార్ లో దారుణం జరిగింది. వైశాలి నగరంలోని దాద్ నగర్ లో 2 గ్రూపులు ఘర్షణకు దిగాయి. రెండు వర్గాలకు చెందిన దాదాపు 20 మంది … ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. యాసిడ్ నింపిన బాటిళ్లను విసురుకున్నారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారు. యాసిడ్ మీద పడటంతో… 13 మందికి ఒళ్లు కాలిన గాయాలయ్యాయి. వారిలో నలుగురు మహిళలు ఉన్నారు.
ఘర్షణకు సంబంధించిన ఐదుగురిని అరెస్ట్ చేసినట్టు ఎస్డీపీఓ రాఘవ్ దయాల్ చెప్పారు. ఓ ల్యాండ్ వివాదం పెద్దగా మారి రెండు వర్గాలు కొట్టుకునేంత వరకు వెళ్లినట్టు చెప్పారు. గాయపడిన వారిని హాస్పిటల్ లో చేర్పించారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు పోలీసులు.