హుజూరాబాద్ లో దొరికిన 13 తులాల బంగారం బాధితుడికి అప్పగింత

హుజూరాబాద్ లో దొరికిన 13 తులాల బంగారం బాధితుడికి అప్పగింత

హుజూరాబాద్, వెలుగు: సంచిలో దొరికిన 13 తులాల బంగారం బాధితుడికి అందజేసిన ఘటన ఇది. కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన రెడ్డబోయిన రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూడు రోజుల కింద హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పురు గ్రామం నుంచి 13 తులాల బంగారాన్ని బ్యాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెట్టుకుని బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యలో ఇప్పల నర్సింగాపూర్ శివారులో ఆ బ్యాగు బైక్ వెనుక నుంచి జారి కింద పడిపోయింది. 

రమేశ్ వెంటనే హుజూరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదే టైంలో ఇప్పల నర్సింగాపూర్ గ్రామానికి చెందిన సమ్మయ్య–నపీజా దంపతులకు ఆ బ్యాగు దొరికింది. తమకు దొరికిన బ్యాగును వెంటనే పోలీసులకు అప్పగించారు. వారి నిజాయితీని మెచ్చుకున్న పోలీసులు బుధవారం రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పిలిపించి సీఐ కరుణాకర్ సమక్షంలో బంగారాన్ని అప్పగించారు. దంపతుల నిజాయితీని పోలీసులు  ప్రశంసించారు.