వైరా, వెలుగు: బాలికపై ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడి పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం శాంతినగర్ కు చెందిన 13 ఏళ్ల బాలిక ఓ ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతోంది.
శుక్రవారం రాత్రి చర్చికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా, అదే కాలనీకి చెందిన ముగ్గురు వ్యక్తులు బాలికకు మాయమాటలు చెప్పి పొదల్లోకి లాకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. బాలిక కేకలు వేయడంతో వారు పరారయ్యారు. శనివారం బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయగా, ముగ్గురిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సురాజ్ తెలిపారు.
