1300 ఏళ్ల నాటి కాయిన్ విలువ రూ.14 లక్షలు

1300 ఏళ్ల నాటి కాయిన్ విలువ రూ.14 లక్షలు

ఆండీ హాల్ బ్రిటన్ లోని మెటల్ డిటెక్టరిస్ట్. ఆయనకు 2016 జనవరిలో పొలంలో ఒకకాయిన్ దొరికింది. ఇంటికి తీసుకెళ్లి కడిగి చూసిన ఆయన.. అదొక అరుదైన వెండి నాణెమని, రాజుల కాలం నాటిదని గుర్తించాడు.దానిపై సాక్సన్ కింగ్ బొమ్మ కూడా ఉంది. దీని గురించి గూగుల్ లో సెర్చ్ చేసిన హాల్… ఈ కాయిన్ 1300 ఏళ్ల నాటిదని కనుగొన్నాడు.క్రీ.శ 826కి చెందినదని తెలుసుకున్నాడు. ఈ కాయిన్ ను వేలం వేస్తే బాగా ధర పలుకుతుందని భావించాడు. అయితే అది సాక్సన్ కింగ్ లకాలం నాటిదేనని రుజువు ఏంటని పలువురు ప్రశ్నించారు.

దీంతో హాల్.. ఈ కాయిన్ రాజులకాలం నాటిదేనని ప్రూవ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ రూ.2.80 లక్షల ఖర్చు…ఈ కాయిన్ రాజుల కాలం నాటిదేనని రుజువు చేసేందుకు హాల్ ఆధారాలు సేకరించారు. చరిత్ర పుస్తకాలను తిరిగేశారు. ఆ కాయిన్ పైఉన్న బొమ్మ సాక్సన్ కింగ్ లుడి కాదని, అప్పట్లో లండన్ రాజ్యంలో భాగమైన మెర్సియాను క్రీ.శ826 –827లో ఇతడు పరిపాలిం చాడని గుర్తించాడు. ఇది 95% స్వచ్ఛమైన వెండి నాణెమని,క్రీ.శ 810–840 కాలంలో ఇవి అందుబాటులో ఉన్నాయని తెలుసుకున్నాడు. ఇందుకోసం మూడేళ్లు శ్రమించాడు. రూ.2,80,000 ఖర్చుకూడా చేశాడు. ఆధారాలు సేకరించిన హాల్తాజాగా దీన్ని వేలం వేయనున్నాడు. ఇందుకు లండన్ లోని డిక్స్ నూనన్ వెబ్ ను ఆశ్రయించాడు. ఈ నాణేన్ని పరిశీలించిన నిర్వా హకులురూ.14 లక్షలు పలుకుతుందన్నారు. మార్చి10న ఈ కాయిన్ ను వేలం వేయనున్నారు.