హిట్ అండ్ రన్ కేసులో మిహిర్‌ షాకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ

హిట్ అండ్ రన్ కేసులో మిహిర్‌ షాకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ

హిట్ అండ్ రన్ కేసులో శివసేన నేత రాజేష్‌ షా కుమారుడు మిహిర్‌ షాకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. మిహిర్ షా మద్యం మత్తులో కారు నడిపి ఓ వివాహిత మరణానికి కారణమైన ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. యాక్సిడెంట్ కు కారణమైన ప్రధాన నిందితుడు మిహిర్‌ షాకి కోర్టు 14 రోజుల పాటు జుడీషియల్‌ కస్టడీ విధించింది. ఈ కేసులో అరెస్టైన మిహిర్‌ షా కస్టడీ నేటితో ముగియడంతో అతడిని శివాది కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఈక్రమంలో కోర్టు నిందితుడికి జూలై 30 వరకూ జుడీషియల్‌ కస్టడీ విధిస్తూ తీర్పు వెలువరించింది.

ముంబైలోని వర్లీ ప్రాంతంలో తెల్లవారుజామున మిహిర్‌ మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారును వేగంగా నడుపుతూ.. ముందు వెళ్తున్న బైక్ ను ఢీకొట్టాడు. దీంతో స్కూటీపై వెళ్తున్న దంపతులు ఎగిరి రోడ్డుపై పడ్డారు. వేగంగా వెళ్తున్న కారు కావేరి నక్వా(45) పై నుంచి వెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు మిహిర్‌ షాను పోలీసులు ఈ నెల 9న అదుపులోకి తీసుకున్నారు. ముంబైలోని విరారా ప్రాంతంలో మిహిర్‌ను అరెస్ట్‌ చేశారు.