జమ్మూలో 14 రోజులుగా కొనసాగుతున్న ఉగ్రవేట

జమ్మూలో 14 రోజులుగా కొనసాగుతున్న  ఉగ్రవేట

జమ్మూకాశ్మీర్ 14 రోజులుగా ఉగ్రవేట కొనసాగుతోంది. అక్టోబర్ 11 నుంచి సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. 11న సురాన్ కోట్ సెక్టార్లో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలపై ఉగ్రవాదులు దాడి చేసి ఐదుగురిని చంపేశారు. 14న మెందహార్ వద్ద దాడిచేసి మరో నలుగురు సిబ్బందిని హత్య చేశారు. ఆ సమయంలో  విసృత తనిఖీలు చేపట్టిన భద్రతా బలగాలు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ముస్తఫాను అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ అతడ్ని ఘటన స్థలానికి తీసుకెళ్లి ఉగ్రవాదుల గూడారాలు, ఇతర అంశాలపై సీన్ రీకన్ స్ట్రక్షన్ చేశారు. ఈ సమయంలో పోలీసులు, భద్రతాబలగాలపై కాల్పులు జరిపారు ఉగ్రవాదులు.  దీంతో సోపియాన్ లో ఉగ్రవాదులు, భత్రతాబలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు పోలీసులు, ఓ ఆర్మీ జవాన్ కు గాయాలయ్యాయి. ఉగ్రమూకల స్థావరాలను గుర్తించేందుకు వెళ్లిన బలగాలపై ఒక్కసారిగా కాల్పులు జరిపారు టెర్రరిస్టులు. బలగాల కాల్పుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాది జియా ముస్తాఫా గాయపడ్డట్లు తెలుస్తోంది. గత రెండు వారాలుగా సోపియాన్ అట్టుడుకుతోంది. కాల్పులతో దద్దరిల్లిపోతోంది. వరుస ఘటనలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.