కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి

కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి

బీజింగ్ : చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. అటవీ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి 14 మంది మృతిచెందారు. ఐదుగురు గల్లంతయ్యారు. నైరుతి చైనాలోని సిచువాన్‌ ప్రావిన్స్‌లోని జిన్‌కౌహీ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

జూన్ 4వ తేదీ ఆదివారం ఉదయం ఆరు గంటల సమయంలో  ఈ ప్రమాదం జరిగిందని చైనా ప్రభుత్వ అధికారులు తెలిపారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టాయని వెల్లడించారు.

ప్రస్తుతం ప్రమాదం జరిగిన ప్రాంతంలో సుమారు 40 వేల మంది వరకు నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా ఈ ప్రాంతంలో వర్షాలు పడుతున్నాయని.. వాటి వల్లే ఈ ప్రమాదం జరిగిఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.