కరోనా కేసులు 14352..మృతులు 486

కరోనా కేసులు 14352..మృతులు 486

న్యూఢిల్లీదేశంలో కేసులు 14 వేలు దాటాయి. శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 915  కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా కరోనాకు 486 మంది బలయ్యారు. శుక్రవారం 31 మంది చనిపోయారు.  11,744 యాక్టివ్​ కేసులున్నాయి. 2,006 మంది కోలుకోగా, శుక్రవారం 238 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్​ అయ్యారు. రికవరీ రేట్​ 14 శాతంగా ఉంది. మరణాల రేటు 3.36 శాతం ఉంది. 3,320 కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. అక్కడ 2,826 యాక్టివ్​ కేసులుండగా, ఇప్పటిదాకా 300 మంది కోలుకున్నారు.

ప్రపంచంలో లక్షన్నర మరణాలు

ప్రపంచ వ్యాప్తంగా మరణాలు లక్షన్నర దాటాయి. ఇప్పటిదాకా కరోనా బారిన పడి 1,50,810  మంది చనిపోయారు. 22,30,439 మంది వైరస్​ బారిన పడగా, 5,64,210 మంది కోలుకున్నారు. అమెరికాలో కేసులు 7 లక్షలకు దగ్గరవుతున్నాయి. మొత్తం 6,86,431 మంది వైరస్​ బారిన పడ్డారు. మరణాలూ 35 వేల దాటి, 35,578కి చేరింది.