
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కారు జాగల్లో ఇండ్లు కట్టుకున్నోళ్లకు స్థలాల రెగ్యులరైజేషన్ కింద దాదాపు లక్షన్నరదాకా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు 1,47,268 దరఖాస్తులు వచ్చినట్లు సీఎస్ సోమేశ్ కుమార్ బుధవారం వెల్లడించారు. ఇందులో 125 చదరపు గజాల్లోపు స్థలాలు ఫ్రీ రెగ్యులరైజేషన్ చేయనున్నారు. దీనికి 58వ జీవో కింద 87,520 దరఖాస్తులు రాగా.. 59వ జీవో కింద 59,748 ఆప్లికేషన్లు వచ్చాయి. రెగ్యులరైజేషన్ కోసం ఆప్లికేషన్ల స్వీకరణ గురువారంతో ముగియనుంది.