RC 15 : ఒక సాంగ్ కోసం పదిహేను కోట్లు..!

RC 15 : ఒక సాంగ్ కోసం పదిహేను కోట్లు..!

రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ ఓ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌‌‌‌ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఓపెనింగ్‌ రోజు నుండే ఈ సినిమాపై ఎక్స్‌‌‌‌పెక్టేషన్స్ పీక్స్‌‌‌‌లో ఉన్నాయి. షూటింగ్ జరుగుతున్న కొద్దీ  ఆ అంచనాలు మరిన్ని పెరుగుతూ వస్తున్నాయి. దానికి శంకర్, చరణ్, కియారాలతో పాటు ఎస్.జె.సూర్య, అంజలి, నవీన్ చంద్ర, సముద్రఖని లాంటి క్రేజీ కాంబినేషనే కారణం. శంకర్ సినిమాల్లోని సాంగ్స్ ఎంత రిచ్‌‌‌‌గా ఉంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నిర్మాత దిల్ రాజు కూడా  బడ్జెట్‌‌‌‌ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదట.

తాజాగా ఒక సాంగ్ కోసం దాదాపు పదిహేను కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పాటను పన్నెండు రోజులపాటు న్యూజిలాండ్‌‌‌‌లో షూట్ చేయనున్నారు. సౌత్ ఇండియాలోనే అత్యంత ఖరీదైన పాటగా ఇది నిలువనుందట. శంకర్ తన సినిమాల్లోని పాటలను ప్రేక్షకులు పదేపదే చూసేలా విజువల్ వండర్‌‌‌‌‌‌‌‌గా తెరకెక్కిస్తారు. ఈ పాట విషయంలోనూ ఆయన అదే చేస్తున్నట్టు అర్ధమవుతోంది. పొలిటికల్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో చరణ్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇంకా టైటిల్ కూడా  ప్రకటించకపోవడంతో రోజుకో పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.