అడవిలో చిక్కుకున్న 150 మంది పర్యాటకులు సేఫ్

అడవిలో చిక్కుకున్న 150 మంది పర్యాటకులు సేఫ్

ములుగు జిల్లా ముత్యంధార జలపాతం దగ్గర వరద దాటికి చిక్కుకున్న 150 మందికిపైగా పర్యాటకులు సేఫ్ గా బయటపడ్డారు. వీరభద్రవరంకు చెందిన ముగ్గురు యువకులు వారిని సురక్షితంగా తీసుకొచ్చారు. ముగ్గురు యువకులు మూడు వాగులు దాటించాక NDRF బృందాలు వచ్చాయని చెబుతున్నారు.. టూరిస్టులను కాపాడిన యువకులు. రాత్రి 8 గంటల సమయంలో పోలీసులకు ఫోన్ చేస్తే.. వాళ్లు వచ్చేసరికి తెల్లవారుజామున 2 గంటలు అయ్యిందని తెలిపారు. పర్యాటకులంతా సేఫ్ గా బయటపడటంతో ఊరిపి పీల్చుకున్నారు అధికారులు. 

ములుగు జలపాతం చూడటానికి నిన్న మధ్యాహ్నం 8 ప్రైవేట్ వెహికల్స్ లో వీరభద్రవరం గ్రామానికి వచ్చారు టూరిస్టులు. అక్కడి నుంచి ట్రాక్టర్ లో అడవిలోకి వెళ్లారు. అక్కడి నుంచి కాలినడకన జలపాతం దగ్గరకు చేరుకున్నారు. ఇదే సమయంలో వాన స్టార్ట్ అవడం.. వాగులు పొంగడంతో అక్కడే బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు. విషయాలన్ని ఫోన్ ద్వారా ములుగు పోలీసులకు తెలియజేశారు.