అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

వాషింగ్టన్ : అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. న్యూయార్క్లోని బ్లూక్లిన్లో 36 స్ట్రీట్ సబ్ వే స్టేషన్లో ఓ దండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 16 మంది గాయపడ్డారు. సబ్ వే స్టేషన్ రద్దీగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న న్యూయార్క్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్టేషన్లో పేలుడు పదార్థాలు కూడా ఉన్నట్లు వార్తలు వచ్చినా.. అవేవీ లభ్యం కాలేదని పోలీసులు చెప్పారు. కాల్పులు జరిపిన దుండగుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దేశంలో తుపాకుల వినియోగంపై ప్రెసిడెంట్ జో బైడెన్ కొత్తగా నియంత్రణ చర్యలు ప్రకటించిన మరుసటి రోజే ఈ ఘటన జరిగింది.