కొద్ది నెలల్లోనే విద్యుత్​ ఉత్పత్తికి చాన్స్​

కొద్ది నెలల్లోనే విద్యుత్​ ఉత్పత్తికి చాన్స్​
  • మొదటి యూనిట్ బాయిలర్​లో స్టీమ్ జనరేషన్ టెస్ట్ సక్సెస్​ 
  • కొద్ది నెలల్లోనే విద్యుత్​ ఉత్పత్తికి చాన్స్​

గోదావరిఖని, వెలుగు : రామగుండంలోని తెలంగాణ ప్లాంట్​లో 1600 మెగావాట్ల విద్యుత్​ ఉత్పత్తి కోసం జరుగుతున్న రెండు యూనిట్ల మొదటి దశ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. రాష్ట్రాల పునర్విభజన చట్టం ప్రకారం ఈ ప్లాంట్​ మంజూరు కాగా, అందులో భాగంగా చేస్తున్న పనులు వచ్చే డిసెంబర్‌‌‌‌ కల్లా పూర్తి చేసి విద్యుత్‌‌‌‌ ఉత్పత్తి చేసే అవకాశాలున్నాయి. 

బాయిలర్​లో స్టీమ్​బ్లోయింగ్​టెస్ట్​
ఈ నెల 1న తెలంగాణ ప్లాంట్‌‌‌‌లోని స్టేజ్‌‌‌‌–1లో 800 మెగావాట్ల మొదటి యూనిట్‌‌‌‌కు చెందిన బాయిలర్‌‌‌‌లో స్టీమ్‌‌‌‌ బ్లోయింగ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ నిర్వహించగా సక్సెస్​ అయ్యింది. ఈ బాయిలర్‌‌‌‌లో బొగ్గు కాకుండా ఆయిల్‌‌‌‌ వేసి మండించి టెస్ట్‌‌‌‌ చేశారు. బాయిలర్‌‌‌‌లో ఉండే 130 మోటర్లలో ప్రతి మోటర్‌‌‌‌ పనిచేస్తుందా..లేదా అని పరీక్షించారు. ఈ ప్రక్రియ 15 రోజుల నుంచి 20 రోజుల వరకు కొనసాగనున్నది. ఇది ఈ ప్రాజెక్ట్‌‌‌‌లోనే కీలక ఘట్టం. ప్రతి థర్మల్‌‌‌‌ పవర్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌లో బాయిలర్‌‌‌‌, టర్బైన్‌‌‌‌, జనరేటర్లు ముఖ్యమైనవి. వీటిలో బాయిలర్‌‌‌‌లో విడుదలయ్యే స్టీమ్‌‌‌‌ను ఎకనోమైజర్‌‌‌‌ ద్వారా సూపర్‌‌‌‌ హీటెడ్‌‌‌‌ స్టీంగా మార్చి టర్బైన్‌‌‌‌కు తిరిగి ఆ స్టీమ్‌‌‌‌ను వినియోగిస్తారు. అయితే కంబైన్డ్‌‌‌‌ మెయిన్‌‌‌‌ స్టీమ్‌‌‌‌, కంబైన్డ్‌‌‌‌ కోల్‌‌‌‌ రీ హీట్‌‌‌‌ స్టీమ్‌‌‌‌ను పంపించే దశను విజయవంతంగా నిర్వహించడంతో ముందడుగు పడినట్టయ్యింది. సెప్టెంబర్‌‌‌‌ నెలాఖరు వరకు ఈ ప్రక్రియను పూర్తి చేసుకుని మరో విభాగాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ సిద్ధమవుతున్నది. గతంలో 800 మెగావాట్ల 2వ యూనిట్‌‌‌‌ బాయిలర్‌‌‌‌ నాన్‌‌‌‌‒డ్రైయినబుల్‌‌‌‌ పోర్టన్‌‌‌‌ హైడ్రో టెస్ట్‌‌‌‌తో పాటు యాష్‌‌‌‌ హ్యాండ్లింగ్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌ఫార్మర్లను ఛార్జ్​చేయడంలో సక్సెస్‌‌‌‌ అయ్యారు. 1వ యూనిట్‌‌‌‌కు చెందిన ఈఎస్‌‌పీ, ఎఫ్‌‌‌‌జీడీల టెస్ట్‌‌‌‌లు కీలక దశలో ఉన్నాయి. కోల్‌‌‌‌ హ్యాండ్లింగ్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌ (సీహెచ్‌‌‌‌పీ) కన్వేయర్‌‌‌‌ ఎరక్షన్‌‌‌‌ పనులు పూర్తికాగా, బెల్ట్‌‌‌‌ ట్రయల్స్‌‌‌‌ ఈ నెలాఖరులోగా జరగనున్నాయి. త్వరలోనే నిర్మాణ పనులు పూర్తి చేసుకుని తెలంగాణ ప్లాంట్‌‌‌‌లో విద్యుత్‌‌‌‌ ఉత్పత్తి దశలోకి తీసుకువస్తామని ఎన్టీపీసీ సీజీఎం సునీల్‌‌‌‌ కుమార్‌‌‌‌ తెలిపారు. 

2018లో ప్రధాని శంకుస్థాపన
రామగుండంలో ఎన్టీపీసీ తెలంగాణ ప్లాంట్‌‌‌‌ స్టేజ్‌‌‌‌ 1 (1600 మెగావాట్లు) నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ 2018 ఆగస్టు 7న శంకుస్థాపన చేశారు. రూ.10,600 కోట్ల వ్యయంతో బీహెచ్‌‌‌‌ఈఎల్‌‌‌‌ సంస్థ ఈ ప్లాంట్‌‌‌‌ను నిర్మిస్తున్నది. ఏటా ఎనిమిది మిలియన్‌‌‌‌ టన్నుల బొగ్గును సింగరేణి నుంచి, ఒడిశాలోని మందాకిని బ్లాక్‌‌‌‌ నుంచి, రెండు టీఎంసీల నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌‌‌‌ నుంచి తీసుకోనున్నారు. ఇందులో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌‌‌‌లో 90 శాతానికి పైగా తెలంగాణ రాష్ట్రానికే కేటాయించనున్నారు.